పద్మశాలి సంఘం వారికి శ్రీముఖం అందజేత

ఆళ్లగడ్డ ప్రతినిధి జనవరి 03 విభారె న్యూస్ :- శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మార్చి బ్రహ్మోత్సవం లో జరుగే స్వామి కళ్యాణోత్సవాలకు పద్మశాలి సంఘం వారిచే ఎన్నుకోబడిన సంఘ సభ్యులైన ఇద్దరు దంపతులు ఉభయదారులుగా వ్యహరిస్తారు. ఈ సందర్భంగా వారిని ఉభయదారులుగా వ్యహరించమని శ్రీ అహోబిలం దేవాలయ పరంపర ధర్మకర్తయగు అహోబిల మఠం పీఠాధిపతి సమక్షంలో ఆలయ ముద్రకర్త వేనుగోపాలాచార్యులు అనాదిగా అహోబిలం దేవాలయం లో కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం ప్రకారం పద్మశాలి సంఘం వారికి శ్రీముఖం అందజేశారు. మార్చి నెల 22.03.2024న ఎగువఅహోబిలం, 23.03.2024 న దిగువ అహోబిలం బ్రహ్మోత్సవం లో భాగంగా జరిగే కల్యాణోత్సవం లో పద్మశాలి సంఘం వారిని ఉభయదారులుగా వ్యవహరించ నున్నారు. శ్రీ సందర్భంగా ముద్రకర్త వేణుగోపాలాచార్యులు జిపిఏ ఎస్. సంపత్ ఆద్వర్యంలో వారికి శ్రీముఖం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ అహోబిల పద్మశాలీయ సంఘo గౌరవ అధ్యక్షులు బర్రెoకల నీలకంటేశ్వరo, అధ్యక్షులు పబ్బు తులసి కృష్ణ , ప్రధాన కార్యదర్శి కోటా రామయ్య, ఉపాధ్యక్షులు కట్టా రామకృష్ణ , ఉపాధ్యక్షులు సేపూరి మద్దిలేటి, కోశాధికారి సేపూరి సుబ్బరామయ్య , సహాయ కోశాధికారి గాజుల రామలింగేశ్వరం, కార్యదర్శి అవ్వరు మల్లికార్జున, సంఘ సభ్యులు గాజుల రామలింగేశ్వర్, చుప్పల రెడ్డయ్య, చింతలపల్లె ముని రామకృష్ణ, బాకా నరసయ్య, మేనేజర్ బిజ్జా శివ, ఉప్పల ప్రసాద్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.