విభారె న్యూస్ కర్నూలు మా ప్రతినిధి డిసెంబర్ 30– శనివారం ఉలిందకొండ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము వంశపారపర్యము అర్చకులు రమణ స్వామి మరియు రాజగోపాలస్వామి వారి ఆధ్వర్యంలో పాంచరాత్ర శాస్త్ర ప్రకారము తిరుపతి వేద పండితులు రాధాకృష్ణ స్వామి, కల్లె ప్రతాప్ శర్మ మరియు ఇతర పండితులచే అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గౌరు వెంకటరెడ్డి గారు వారి సతీమణి గౌరు చరిత రెడ్డి గారలు స్వామి వారి కళ్యాణం లో పాల్గొని వారి అనుగ్రహం పొందడం జరిగినది. స్వామివారి కల్యాణంలో పాల్గొన్న వందలాది మంది భక్తులకు అగ్రహారం వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగినది.