ఆళ్లగడ్డ ప్రతినిధి సెప్టెంబర్:12:విభారె న్యూస్ :- ఆళ్లగడ్డ పట్టణంలోని స్వామి వివేకానంద విశ్వమానవ సేవా సమితి లో శిక్షణ పొందిన ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన లక్ష్మీ చందన అనే విద్యార్థిని ఈనెల 9, 10 తేదీలలో కర్నూల్ లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీలలో సిల్వర్ మెడల్స్ సాధించి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు నంద్యాల జిల్లా యోగాసన అసోసియేషన్ చైర్మన్ ఆవుల విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. బాల్యం నుంచే యోగాను అభ్యసించడం ద్వారా విద్యార్థినీ విద్యార్థులలో క్రమశిక్షణ, శారీరక, మానసిక వికాసం కలుగుతుందని, ఆయన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీ చందనను ఆవుల విజయ భాస్కర్ రెడ్డి, ఆవుల లతా రెడ్డి ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి కార్యాలయంలో అభినందించారు. అనంతరం అద్భుతమైన శిక్షణ ఇచ్చి జాతీయస్థాయి పోటీలకు తీర్చిదిద్దిన వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డిని స్వామి వివేకానంద విశ్వమానవ సేవా సమితి అధ్యక్షులు శివప్రసాద్ ను వారు అభినందించారు.