
ఉత్తర ప్రదేశ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నివశిస్తున్న 20 సంవత్సరాల యువకుడు ఒక వ్యక్తి యొక్క బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి 10 లక్షల రూపాయలు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఒక నెల రోజుల కాలంలోనే ఈ మొత్తము దొంగిలించబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ యువకుడు ఆన్లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు, ఆ గేమ్ లోని ఒక్కొక్క దశ పూర్తి చేసినప్పుడు, దశలవారీగా హ్యాకింగ్ ట్రిక్స్ నేర్పినట్లు ఆ యువకుడు తెలిపాడు. ఆన్లైన్లో నేర్చుకున్న హ్యాకింగ్ ట్రిక్స్ ద్వారానే ఒక వ్యక్తి యొక్క బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి 10 లక్షల రూపాయలు దశలవారీగా దోచుకున్నట్లు ఆ యువకుడు పోలీసులకు వివరించాడు. మే 12వ తేదీన హరి వంశ లాల్ వాస్తవ అనే టీచర్ బిలారియాగంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా పరిశోధించిన పోలీసులు హ్యాకింగ్ కు ఉపయోగించిన మొబైల్ నెంబరు కనుక్కోగలిగారు. తద్వారా ఆ హ్యాకర్ ను గుర్తించగలిగారు. ఆ ఆన్లైన్ గేమ్ లోని ఒక్కోదశ పూర్తి చేసినప్పుడు హ్యాకింగ్ ట్రిక్స్ నేర్పినట్లు ఆ బాలుడు చెప్పిన విషయాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆన్లైన్ గేమ్ లతో నేటి యువత నిర్వీర్యమై పోతున్నది అనేందుకు ఇది ఒక ఉదాహరణ.