
ఆగ్రా : ఆగ్రా లోని ఒక పాఠశాల మరుగుదొడ్డిలో పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఒక చిరుత మృతదేహం కనుగొన్నారు.చిరుతపులి పాఠశాల భవనం పైకప్పుకు చేరుకుని పొరపాటున మరుగుదొడ్డిలో పడిందని, దాని తలుపులు బయటి నుండి తాళం వేసి ఉండుటవలన చిరుత బయటకు రాలేక పోయిందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా, పాఠశాల భవనానికి ఎవరూ రావడం లేదు. అందువలన చిరుత ఆహారం లేక ఆకలితో చనిపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు.