ఆళ్లగడ్డ:: విభారె న్యూస్:: ఈనెల 13వ తేదీన ఆళ్లగడ్డ లోని T B రోడ్, ఆవుల పుల్లారెడ్డి యోగ హాల్ నందు ఉదయం 9 గంటలకు నంద్యాల 2 వ జిల్లా స్థాయి యోగ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ ఆవుల విజయభాస్కర్ రెడ్డి గారు తెలిపారు.ఎంపిక పోటీలను *8-10, 10-12, 12-14,14-16, 16-18, 18-21, 21-25, 25-30, 30-35, 35-45, 45* పై బడిన వయస్సు వారికి బాల బాలికలు మరియు స్త్రీ,పురుషుల విభాగంలో నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు y బాలకృష్ణ , కార్యదర్శి p హనుమంత రెడ్డి తెలిపారు.జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను సెప్టెంబర్ రెండో వారం కర్నూలు జిల్లాలో జరగబోయే 48వ రాష్ట్రస్థాయి యోగాసనాల పోటీలకు నంద్యాల జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు అన్నారు.జిల్లా స్థాయి యోగ పోటీలకు వచ్చేవారు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రము తెచ్చుకోవలెను. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్లను 9866136324, 9440826259 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.