మళ్లీ తెరపైకి ఖలిస్తాన్..?? ముగ్గురు కె.ఎల్. ఎఫ్ సానుభూతిపరులు అరెస్ట్

ఢిల్లీ : దివంగత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో పంజాబ్ రాష్ట్రాన్ని గజగజ వణికించిన ఖలిస్తాన్ తీవ్రవాదాన్ని ఆమె ఉక్కుపాదంతో అణిచి వేశారు. చివరకు ఖలిస్తాన్ సానుభూతిపరులే అంగరక్షకుల రూపంలో ఆమెను బలి తీసుకున్న “ఖలిస్థాన్” పేరు మళ్లీ ఒకసారి తెరపైకి వచ్చింది. సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రిని బలితీసుకున్న ఈ ఉద్యమం పేరు మళ్ళీ వినబడడంతో ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.  ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందము ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ సానుభూతిపరులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరు వివిధ రాష్ట్రాలలో హత్యలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని తెలిసి వీరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో తీవ్రవాద కార్యకలాపాలకు పథక రచన చేస్తున్న మహేందర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు డి.సి. పి. సంజీవ్ కుమార్ యాదవ్ తెలిపారు,  లవ్  ప్రీత్ ను హర్యానాలో, గుర్తేజ్ ను పంజాబ్లో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.