వాల్మీకి బోయలను వెంటనే ఎస్టీలుగా పునరుద్ధరించాలి

కర్నూలు:(విభారె): స్థానిక కర్నూలు నగరంలోని కృష్ణకాంత్ ప్లాజా నందు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ జేఏసీ ఆధ్వర్యంలో వాల్మీకి బోయల ఎస్టీ బిల్లుపై ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. జేఏసీ నాయకులు వినోద్కుమార్ వాల్మీకి రంగముని నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా వాల్మీకి బోయలకు ఒరిగిందేమీ లేదని, 2019 ఎలక్షన్లకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు బోయలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, వారు అన్నారు. ఎస్ టి బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను మంత్రులను కలిసి అనేక సార్లు వినతిపత్రాలు సమర్పించిన కూడా ఎలాంటి చర్య తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇతర కులాల పై వరాల జల్లు కురిపిస్తున్న ముఖ్యమంత్రి గారు బోయ వాల్మీకులను మాత్రం చిన్నచూపు చూస్తున్నారని వారు అన్నారు. లేనిపక్షంలో రాష్ట్రంలో బలమైన వాల్మీకి ఉద్యమం తెచ్చి ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి వి నాయుడు,  సూర్య ప్రకాష్ నాయుడు,  ప్రశాంత్ వాల్మీకి,  సతీష్ వాల్మీకి,  సురేష్ వాల్మీకి,  భీమరాజు వాల్మీకి,  వెంకటేష్,  బాలకృష్ణ, అశోక్ వాల్మీకి తదితరులు పాల్గొన్నారు