::(విభారె న్యూస్) :: ఆళ్లగడ్డ పట్టణంలోని టీ.బి.రోడ్డు నందు గల ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి వారు టైలరింగ్ నందు ఉచిత శిక్షణా శిబిరం ప్రారంభించనున్నారు. ఆసక్తిగల వారు ఈ అవకాశమును సద్వినియోగము చేసుకోవలెనని ఆ సంస్థ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కరరెడ్డి తెలిపారు . ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే తమ పేరును ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి యందు అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోగలరు. టైలరింగ్ నందు శిక్షణ పొందగోరు వారు 16 సంవత్సరములు ఆపై వయస్సు కలిగి ఉండవలెను. గత ఆరు సంవత్సరాల నుండి కంప్యూటర్ మరియు టైలరింగ్ నందు పూర్తిగా ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు, శిక్షణ పూర్తయిన వెంటనే సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు ఆవుల విజయభాస్కర రెడ్డి తెలిపారు.01-04-2023 నుండి శిక్షణ ప్రారంభమగును. శిక్షణ కొరకు దరఖాస్తులు తేదీ:24-03-2023 నుండి ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి కార్యాలయం నందు ఉదయం 10 గంటల నుండి12 గంటల వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు పొందగలరు. దరఖాస్తు చేసుకొను అభ్యర్థులు తమ పాస్ పోర్ట్ సైజు ఫోటో తీసుకొని రావలెను. దరఖాస్తులు వెంటనే పూర్తి చేసి కార్యాలయము నందు ఇవ్వవలెను. వివరముల కొరకు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.9440232308 @ 9542044106 @ 9441808737.