కంటైన్మెంట్ ప్రాంతంలో నిరంతర పర్యవేక్షణ : ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు.

ఆళ్లగడ్డ : (విభారె న్యూస్): ఆళ్లగడ్డ పట్టణంలోని ఎల్.ఎం. కాంపౌండ్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా  2 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో, అధికారులు బాధితుల ఇంటి నుంచి దాదాపు రెండు వందల మీటర్ల పరిధి వరకు అధికారులు కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన విషయం విధితమే.   కంటైన్మెంట్ జోన్ కు సమీపంలోనే వైద్య  సహాయకులతో కూడిన   బృందం నిరంతరంగాా పర్యవేక్షిస్తుందని మునిసిపల్ కమిషనర్  రమేష్ బాబు తెలిపారు. కంటైన్మెంట్ జోన్ ప్రాంతంలోని 62 మంది నుండి రక్త నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. ఫలితాలు రావాల్సి ఉంది. ఫలితాలు వెలువడిన తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వెళ్లాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం పాటించాలని, బహిరంగ ప్రదేశాలలో ఏవైనా వస్తువులు తాకినపుడు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని,   ప్రభుత్వ అధికారుల సూచనలను క్రమం తప్పకుండా పాటిస్తే కరోనాను జయించడం కష్టమైన  విషయం కాదని కమీషనర్ రమేష్ బాబు తెలిపారు