
టోకియో :ఒకవైపు ప్రపంచమంతా కరోనా వైరస్ ధాటికి అన్ని విధాలుగా నష్టపోయి, కరోనా బారినుండి ఎలా బయటపడాలో తెలియక తికమక పడుతుంటే జపాన్ దేశం మాత్రం కొత్తరకం సమస్యతో తల పట్టుకుంటోంది. ఎందుకంటే జపాన్ లో ప్రయోగ దశలో ఉన్న కోవిడ్ 19 క్లినికల్ ట్రయల్స్ కోసం తగినంత మంది కరోనా పేషెంట్లు లేక ఎదురుచూస్తోంది. ఎందుకంటే కరోనా వైరస్ ను ఓడించి, దానిపై విజయం సాధించిన ఏకైక అభివృద్ధి చెందిన దేశం జపాన్ మాత్రమే. కనుక క్లినికల్ ట్రయల్స్ రోజురోజుకు వెనుకబడి పోతున్నాయి. జపాన్ దేశం లో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య చాలా తక్కువ. ఆ కొద్దిమందికి విజయవంతంగా పూర్తి స్థాయిలో చికిత్స చేసి ఇళ్లకు పంపిణీ చేశారు. ప్రతి విషయంలోనూ కఠినమైన క్రమశిక్షణతో ఉంటారు. కనుక నిరంతరం సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ ప్రభుత్వ ఆదేశాలను, సూచనలను క్రమం తప్పకుండా పాటించడంతో జపాన్ నుంచి కరోనా పారిపోయింది. చైనాలో 6 టీకాల కు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. చైనా తో కలిపి ప్రపంచం మొత్తం మీద 12 టీకాల కు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కానీ జపాన్ దేశంలో రూపొందుతున్న టీకాల క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కావడానికి మరికొంత కాలం ఎదురు చూడాల్సి ఉంటుంది. ప్రపంచంలో కొవిడ్-19 ప్రభావానికి చిక్కని ఏకైక ఏకైక దేశంగా జపాన్ మిగిలి పోతుందేమో!