పోలీసుల సంక్షేమం పై విడియో కాన్ఫరెన్సు నిర్వహించిన కర్నూల్ జిల్లా ఎస్పీ

కర్నూలు:(విబారె న్యూస్):జూన్ 24.    జిల్లా పోలీసుల సంక్షేమం పై జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి జిల్లా పోలీసు కార్యాలయంలోని కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్  నుండి విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లతో జిల్లా ఎస్పీ గారు విడియో కాన్పరెన్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ గారు పోలీసు సిబ్బంది తో మాట్లాడారుకరోనా నేపథ్యంలో ఆయా పోలీసుస్టేషన్ల పరిధులలోని పోలీసు కుటుంబాలు, పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులు కరోనా వైరస్ నుండి  స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఏమైనా కరోనా లక్షణాలు ఉంటే అవసరమైనా ట్రీట్ మెంట్ కొరకు ముందుకు రావాలన్నారు.ఫిర్యాదుదారులు  పోలీస్ స్టేషన్లను ఆశ్రయించిన అప్పుడు థర్మల్ స్కానర్ వాడలన్నారు. శానిటైజర్ లు, మాస్కులు వాడే విధంగా చూడాలన్నారు.రద్దీగా ఉండే ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు  తీసుకోవాలన్నారు.పోలీసు స్టేషన్ పరిసరాలను, పోలీసు వాహనాలను కూడా  ఎప్పటికప్పుడు హైపో ద్రావణంతో శానిటైజ్ చేసుకోవాలన్నారుపోలీసులు కోవిడ్ నివారణ జాగ్రత్తలు పాటిస్తూ ఇతరులకు  స్ఫూర్తిగా నిలవాలన్నారు కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటూ, ఇమ్యూనిటీ పెంచే సి విటమిన్  కలిగిన ఫ్రూట్స్, డైట్ తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి  పోలీస్ వెల్ఫేర్ డాక్టర్ గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఈ బి అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ గారు,  హోంగార్డు కమాండెంట్ శ్రీ రామ్మోహన్ , నాన్ క్యాడర్ ఎస్పీ శ్రీ ఆంజనేయులు గారు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ రాధాకృష్ణ,  కొవీఢ్ కంట్రోల్ రూమ్ ఇంచార్జ్  డీఎస్పీ శ్రీ నాగభూషణం, పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీమతి స్రవంతి గారు,  కమ్యూనికేషన్ సీఐ శ్రీ రమేశ్ బాబు, వేల్పేర్ ఆర్ ఐ శ్రీ రాధాకృష్ణ ఉన్నారు.