పునర్ నిర్మించిన కర్నూలు పోలీసు అతిథి గృహం ను ప్రారంభించిన కర్నూలు రేంజ్ డిఐజి
కర్నూలు (విభారె న్యూస్):జూన్ 23. కర్నూలు నగరంలోని బి.క్యాంపు దగ్గర పునర్ నిర్మాణం చేసిన పోలీసు ఉన్నతాధికారుల అతిథి గృహం ను కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ పి. వెంకటరామి రెడ్డి గారు, కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ జి. వీరపాండియన్ గారు, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారులు కలిసి మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జెసి రవిపటాన్ శెట్టి గారు, ఎస్ ఈ బి అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ డి.కె బాలజీ గారు, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, హోంగార్డు కమాండెంట్ శ్రీ రామ్మోహన్ , నాన్ క్యాడర్ ఎస్పీ శ్రీ ఆంజనేయులు గారు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ రాధాకృష్ణ, డిఎస్పీలు శ్రీ బాబా ఫకృద్దీన్, శ్రీ రామకృష్ణ, శ్రీ నరసింహా రెడ్డి, శ్రీ చిదానందరెడ్డి, శ్రీ వెంకట్రావు, శ్రీ వెంకటాద్రి, శ్రీ రమణ, శ్రీ మహబూబ్ భాషా, ఇంటెలిజెన్స్ డిఎస్పీ శ్రీ వెంకట్రాముడు, ఎఆర్ డిఎస్పీ శ్రీ ఇలియాజ్ భాషా, సిఐలు, ఆర్ ఐలు , ఆర్ ఎస్సైలు ఉన్నారు.