ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్) :: ఆర్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి మరియు వివేకానంద విశ్వ మానవ సేవా సమితి వారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశిష్ట మహా పూజలునిర్వహిస్తున్నారు. స్వస్తిశ్రీ శుభకృత నామ సంవత్సర మాఘమాస త్రయోదశి 18-2-23 అనగా ఈ శనివారం మహాశివరాత్రి ప్రత్యేక విశిష్టత కలిగి ఉంది
ఈ సంవత్సరం మహాశివరాత్రి 26 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. శనివారం శనిత్రయోదశి కావడం విశేషం మరియు మాసశివరాత్రి అవ్వడం మరో ప్రత్యేక విశిష్టత. ఇన్ని కలిగిన ఈ మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరుని సేవ చేసుకుంటే శని దోషాలు తొలిగి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పొందగలరని పండితులు చెబుతున్నారు. కావున భక్తాదులు ఈ మహాశివరాత్రి శుభ పర్వదినాన పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. పూజలో పాల్గొను భక్తులకు పూజా సామాగ్రి ఉచితంగా అందజేయబడును.