బాల కార్మికులను బడికి పంపండి : ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ వెంకటరెడ్డి

ఆళ్లగడ్డ::( విభారె న్యూస్ ):: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా ఆర్లగడ్డ పట్టణ ఎస్సై వెంకట్ రెడ్డి పట్టణంలోని పలు
హోటళ్లు, దుకాణ సముదాయాలు, మెకానిక్ షెడ్ల లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల కార్మికులతో పని చేయించడం నేరమని, వారిని బడిలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాలల భవిష్యత్తు కోసం అనేక విద్య వసతులు కల్పిస్తూ ఉందని, వాటిని అందిపుచ్చుకొని భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అన్నారు. బాల కార్మికులతో పని చేయించే యజమానులపై కఠిన చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.