విభారె న్యూస్ :: ఆళ్లగడ్డ :: ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి వారి ఆధ్వర్యంలో ఈనెల 28వ తారీకు శుక్రవారం ప్రారంభించవలసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమము వాయిదా వేయడమైనదని, తగినంత సంఖ్యలో దరఖాస్తులు రానందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రారంభ తేదీని గురించిన సమాచారం త్వరలో తెలియజేయబడునని ఆయన తెలిపారు. పదవ తరగతి ఆ పై చదువులు చదివిన విద్యార్థిని విద్యార్థులకు కూడా అప్లికేషన్లు ఇవ్వబడుతున్నవి. దరఖాస్తు చేసుకొనదలచిన అభ్యర్థులు ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి కార్యాలయంలో సంప్రదించగలరు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు, సాయంత్రం ఐదు గంటల నుండి 7 గంటల వరకు దరఖాస్తులు ఇవ్వబడును. వివరముల కొరకు ఈ క్రింది మొబైల్ నెంబర్లను సంప్రదించండి. 79898 27278, 78933 82336, 94402 32308, 94418 08737,