నంద్యాల జిల్లా యోగా సంఘం చైర్మన్ ఆవుల విజయభాస్కర్ రెడ్డి
ఆళ్లగడ్డ:: విభారె న్యూస్:: విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుందని జిల్లా యోగ అసోసియేషన్ ఛైర్మన్ ఆవుల విజయభాస్కర్ రెడ్డి అన్నారు.ఆదివారం ఆళ్లగడ్డలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి యోగా హాల్లో జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్,జూనియర్,సీనియర్ బాలబాలికల విభాగంలో నిర్వహించిన ఎంపిక పోటీలకు రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి పాటు జిల్లా సంఘం కార్యదర్శి హనుమంత రెడ్డి తో కలిసి ఆయన ముఖ్య అతిధులుగా హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆవుల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సెప్టెంబర్ మొదటి వారంలో ద్వారకాతిరుమలలో జరగబోయే 50 వ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు నంద్యాల జిల్లా తరఫున ప్రతినిత్యం వహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీధర్, శ్రీనివాసరెడ్డి,ప్రతాప్,బాబు,మనోహర్ బాబు,బుచ్చిబాబు, బాలస్వామి రెడ్డి,దివాకర్,రవి, రామచంద్ర,సుబ్బారాయుడు,
ఓబన్న, షేక్షావలి,అక్బర్, ప్రతాపరెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.