విధినిర్వహణలో గుండెపోటుతో మరణించిన నంద్యాల జిల్లాకు చెందిన జవాన్

విభారె న్యూస్:: ఆళ్లగడ్డ :: నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం, పెద్ద వంగలి గ్రామమునకు చెందిన సైనికుడు P. అశోక్ కుమార్ విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు కారణంగా సోమవారంనాడు మృతి చెందారు. ఉదమ్ పూర్ యూనిట్ రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో విధి నిర్వహణలో ఉండగానే హఠాత్తుగా గుండెపోటు రావడంతో అశోక్ కుమార్ మరణించారు. ఆయన పార్థివ శరీరం ఈ రోజు ఉదయం 7 గంటలకు పెద్ద వంగలికి చేరుకున్నది. అశోక్ కుమార్ గారి తండ్రి రాజశేఖర్ కూడా బిఎస్ఎఫ్ లో అధికారిగా పని చేస్తూ ఉన్నారు. అంతిమ దర్శనానికి ఆళ్ళగడ్డ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు C. దస్తగిరి రెడ్డి గారు ,R.రమణయ్య గారు,వV.J భాష గారు మరియు N.మధు సూధన్ రెడ్డి గారు కర్నూలు జిల్లా సైనిక సంక్షేమ అధికార్లు అశోక్ కుమార్ పార్థివ దేహానికి శ్రంథాంజలి ఘటించారు.