ఆళ్లగడ్డ::విభారె న్యూస్:: ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి ఆవరణంలో నందు విశ్వహిందూ పరిషత్ ప్రఖండ మాసిక వర్గ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 70 గ్రామాల నుండి విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. హిందూ ధర్మ రక్షణ బాధ్యత యువతపై ఉందని, ప్రతి గ్రామాన యువకులు కమిటీలుగా ఏర్పడి ఆలయాలను రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో హిందూ యువతులను లక్ష్యం చేసుకుని మాయ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారని, కనుక హిందూ యువతులు వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకు అవసరమైన మార్గదర్శకాలను ఆయన సూచించారు. నంద్యాల జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ గ్రామాలలో ఇతర మతాల వారి నుండి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అనుమతులు లేని అక్రమ ప్రార్థన స్థలాల నిర్మాణం జరుగుతున్నప్పుడు సంబంధిత ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి కట్టడాలు నిలుపుదల చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా సహ కార్యదర్శి మూసాని విశ్వనాథరెడ్డి, ఆళ్లగడ్డ ప్రఖండ కార్యదర్శి మురళి, బజరంగ్దళ్ ప్రఖండ కన్వీనర్ ఈశ్వర ప్రసాదరెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.