ఆళ్లగడ్డలో పెహల్గావ్ ఉగ్రదాడి మృతులకు ఘన నివాళి

విభారె న్యూస్:: ఆళ్లగడ్డ :: జమ్మూ కాశ్మీర్ లోని పెహల్ గావ్ లో ఉగ్ర వాదుల దాడులను ఖండిస్తూ, కాల్పులలో అమరులైన యాత్రికులకు బుధవారం సాయంత్రం ఆళ్లగడ్డలో అశ్రునివాళి అర్పించారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్యవైశ్య సంఘం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి, పాత బస్టాండు వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది ఆవుల విజయ భాస్కర్ రెడ్డి, కార్యదర్శి మురళి, రామకృష్ణ, న్యాయవాదులు నీలకంఠం,మురళీధర్, బోరెడ్డి లక్ష్మిరెడ్డి , ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెన్స్, కె రామాచారి విశ్వకర్మ విశ్వహిందూ పరిషత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.