

విభారె న్యూస్ :: ఆళ్లగడ్డ ::13 ఏప్రిల్ :: ఈరోజు నంద్యాలలో జరిగినటువంటి విశ్వహిందూ పరిషత్ జిల్లా సమావేశం నందు జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి గారు విశ్వహిందూ పరిషత్ ఆళ్లగడ్డ ప్రఖండ అధ్యక్ష కార్యదర్శులను నియమించడం జరిగింది.
విశ్వహిందూ పరిషత్ ఆళ్లగడ్డ ప్రఖండ అధ్యక్షులుగా ఆవుల విజయ భాస్కర రెడ్డి గారిని, కార్యదర్శిగా వై.వి.మురళి (మురళి సెల్ పాయింట్) గారిని నియమించారు . ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన అధ్యక్ష మరియు కార్యదర్శులు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజ సంఘటన కోసం కృషి చేస్తామని తెలిపారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కె.కిషోర్ కుమార్ గారు, సహ కార్యదర్శి ముసాని విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.