ఆళ్లగడ్డలో కంప్యూటర్ కోర్స్ నందు ఉచిత శిక్షణ :: ఆవుల పుల్లా రెడ్డి సేవాసమితి

ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్) :: ఆళ్లగడ్డ పట్టణంలోని టీ.బి.రోడ్డు నందు గల ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి వారు కంప్యూటర్ ఉచిత శిక్షణా శిబిరం ప్రారంభించనున్నారు. ఆసక్తిగల విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశమును సద్వినియోగము చేసుకోవాలని ఆ సంస్థ అధ్యక్షుడు ఆవుల విజయ భాస్కరరెడ్డి తెలిపారు . ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు వెంటనే తమ పేరును ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి యందు అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోగలరు. కంప్యూటర్ నందు శిక్షణ పొందగోరు వారు ఇంటర్మీడియట్ మరియు ఆ పై తరగతులు చదివి ఉండవలెను. గత 10 సంవత్సరాల నుండి కంప్యూటర్ పూర్తిగా ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు, శిక్షణ పూర్తయిన వెంటనే సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 1700 మంది పేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించినట్లు ఆయన తెలిపారు.03-04-2025 నుండి కంప్యూటర్ శిక్షణ ప్రారంభమగును. శిక్షణ కొరకు దరఖాస్తులు తేదీ:23-03-2025 నుండి ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి కార్యాలయం నందు ఉదయం 10 గంటల నుండి12 గంటల వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు పొందగలరు. దరఖాస్తు చేసుకొను అభ్యర్థులు తమ పాస్ పోర్ట్ సైజు ఫోటో తీసుకొని రావలెను. దరఖాస్తులు వెంటనే పూర్తి చేసి కార్యాలయము నందు ఇవ్వవలెను. వివరముల కొరకు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు.94402 32308 – 95420 44106 – 78933 82336 – 94418 08737