ఆళ్లగడ్డలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

విభారె న్యూస్::ఆళ్లగడ్డ:అక్టోబర్17: ఆళ్లగడ్డ పట్టణంలోని కోవెలకుంట్ల రోడ్డులో నిన్న తెల్లవారుజామున వెంకటేశ్వరమ్మ అనే మహిళను మితిమీరిన వేగంతో గుర్తుతెలియని మోటార్ సైకిల్ ఢీకొనడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో ఆమె కుడి చేయి విరిగింది. మరియు తలపై తీవ్ర గాయం అయింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరమ్మను 108 వాహనంలో హుటాహుటిన నంద్యాల ఆసుపత్రికి తరలించారు. మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తి గాయపడిన మహిళను పట్టించుకోకుండా పరారైనట్లు ఆమె కుమారుడు వడ్ల నాగేశ్వరచారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు