వ్యవసాయం లాభసాటిగా “పొలం పిలుస్తోంది” కార్యక్రమం

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
విభారే న్యూస్
కర్నూలు, సెప్టెంబరు, 20 : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం “పొలం పిలుస్తోంది” అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన “పొలం పిలుస్తోంది” పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం”పొలం పిలుస్తోంది” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మంగళ, బుధ వారాల్లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధుల పొలంబాట, పంటల సాగుపై చర్చలు చేయడం జరుగుతుందన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేసి వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించి క్షేత్ర సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించడం జరుగుతుందన్నారు. తక్కువ పెట్టుబడి….అధిక ఉత్పత్తి..ఎక్కువ నికరాదాయం దిశగా ప్రోత్సహించే దిశగా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఎపిఎంఐపి పిడి ఉమాదేవి, మత్స్య శాఖ అధికారి శ్యామల, పశు సంవర్థక శాఖ జెడి శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారి రామాంజనేయులు, సేరికల్చర్ అధికారి విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.