విబారే న్యూస్ డోన్ మా ప్రతినిధి:-సెప్టెంబర్ 20 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట డోన్ నందు ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ ఆధ్వర్యంలో 8,9,10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చెకుముకి టాలెంట్ పరీక్ష నిర్వహించుటకు చెకుముకి టాలెంట్ పరీక్ష పోస్టర్ విడుదల చేసినట్లు వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి మాణిక్యం శెట్టి, బాబు, వెంకట రమణ, లక్ష్మయ్య మాట్లాడుతూ మూఢనమ్మకాలను నమ్మరాదని, ప్రతి ఒక్కరూ గుర్తించి, సైన్స్ అంటే జీవిత భాగస్వామి గా అవగాహన కలిగి ఉండాలని కోరారు. సైద్ధాంతిక మరియు భౌతిక, విజ్ఞాన శాస్త్ర అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళితే మానవ జీవితం సుఖమయం అవుతుందన్నారు. సామాజిక పురోగతి జరగాలంటే సైన్స్ పట్ల నమ్మకం ఉండాలన్నారు. శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకునేందుకు విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, వెంకట లక్ష్మీ, రఘునాథ్ ఎస్తేరమ్మ,రవిశేఖర్, సుబ్బారాయుడు, శ్రీనివాసులు, లక్ష్మి కాంతరెడ్డి, అల్లిపీరా, మద్దిలేటి, సుబాన్, జయసుబ్బారాయుడు, శివన్న, ఆదినారాయణ, సురేష్, మధుసూదన్ రెడ్డి, లీలావతమ్మ, సంజీవరెడ్డి, రమేష్, దేవేంద్రప్ప, భాను ప్రకాష్ రెడ్డి, భారతి, లక్ష్మీ ప్రభావతి, హుస్సేన్ భాను, మహేష్, అల్లిపీరా, తదితరులు పాల్గొన్నారు.