ఆళ్లగడ్డ:: విభారె న్యూస్ :: వినాయక చవితి సందర్భంగా ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి అధ్యక్షులు ఆవుల విజయభాస్కరరెడ్డి దంపతులు మట్టితో తయారు చేసిన వినాయకుని విగ్రహాలు పంపిణీ చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు. వినాయక చవితి పండుగ అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. ఈ పండుగకు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వినాయక ప్రతిమను ఇంటికి తెచ్చుకుని పూజించి అనంతరం నిమజ్జనం చేయడం ఆనవాయితీ.
భవిష్యత్తు తరాలకు కలుషితం లేని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రసాయనాలతో చేసిన విగ్రహాలను వాడకూడదని తెలిపారు. మట్టితో చేసిన విగ్రహాలను కొనుగోలు చేయడం ద్వారా అనేక కులవృత్తులలో ఒకటైన కుమ్మరి వృత్తి అంతరించిపోకుండా ప్రోత్సహించవచ్చునని ఆయన సూచించారు.