ఆళ్లగడ్డ :: ( విభారె న్యూస్) :: 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం ఆళ్లగడ్డ పట్టణంలోని మాజీ సైనికుల కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది,ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం చేసి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ ఎన్నో సుఖాలను సంతోషాలను త్యాగం చేసి దేశ సంక్షేమానికి పాటుపడుతున్న భారత సైనికులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మాజీ సైనికో ఉద్యోగులతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం తనకు సంతోషం కలిగిస్తుందని ఆయన తెలిపారు.నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన మాజీ సైనికో ఉద్యోగుల సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరమని,సమాజ సంక్షేమం కొరకు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇందుకుగాను త్వరలో ఒక కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మాజీ సైనికో ఉద్యోగుల సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షులు దస్తగిరి రెడ్డి మరియు మాజీ సైనికో ఉద్యోగులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.