బాచేపల్లెకు చేరుకున్న అహోబిలం నరసింహస్వామి ఉత్సవ పల్లకి

  • పూజలు నిర్వహించిన శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి
    ఆళ్లగడ్డ ప్రతినిధి జనవరి 17 విభారె న్యూస్ :- అహోబిలేసుని ఉత్సవ పల్లకి కి బాచేపల్లె గ్రామం ప్రజలతో పూజలు అందుకుంది. అహోబిలం పుణ్యక్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారుపేట ఉత్సవాలు అత్యంత వైభవo గా ప్రారంభమయ్యాయి. మొదటగా అహోబిలేసుని పారువేట ఉత్సవ పల్లకి బాచేపల్లి తండా లో పూజలు అందుకుని అక్కడి నుండి రాత్రి బాచేపల్లి గ్రామం చేరుకుంది. గ్రామ శివారులోకి శ్రీ జ్వాల నరసింహ స్వామి, శ్రీ ప్రహ్లాద వరద స్వామి కొలువుదిరిన ఉత్సవ పల్లకి చేరుకోగానే గ్రామ అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి మేల తాళాలతో, భాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపుగా గ్రామంలోకి చేరుకున్న స్వామి పల్లకి బుధవారం వీధి వీధినా ఏర్పాటు చేసిన తెలుపుల వద్ద ఆసీనులై ప్రజల నుండి ప్రజలు అందుకున్నారు. ఆయా తెలుపుల వద్ద శ్రీ జ్వాలా నరసింహస్వామి శ్రీ ప్రహ్లాద వరద స్వాములకు ప్రజలు పూజలు నిర్వహించారు. గ్రామంలో తిరుణాల వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి బాచేపల్లి గ్రామం చేరుకొని అహోబిశుని ఉత్సవ పల్లకి పూజలు నిర్వహించారు.