జగనన్న ఆరోగ్య సురక్ష కు విశేష స్పందన – – – – డాక్టర్ అంకి రెడ్డి హెల్త్ ఆఫీసర్–


విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి జనవరి 03:- . జగనన్న ఆరోగ్య
సురక్ష కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకి రెడ్డి పేర్కొన్నారు .జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ వైద్య శిబిరం బుధవారం దేవనగర్. ఎమ్ ఎస్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రారంభించారు . ఓపీలు తీసుకున్న వారికి అన్ని రకాల ప్రాధమిక పరిక్షలతో పాటు ఉచితంగా వారికి కావాల్సిన మందులు పంపిణీ చేశారు. దేవనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో 453 మంది ఓపీలు తీసుకున్నారని ఎమ్ ఎస్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో 467 మంది ఓపీలు తీసుకున్నారని తెలిపారు . జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు . జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఏర్పాటుచేసిన హెల్ప్ డెస్క్ స్పాట్ రిజిస్ట్రేషన్, కేస్ షీట్ కౌంటర్, ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్, మందులు పంపిణీ కౌంటర్లను పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరాతీశారు . ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోమ శేఖర్ రెడ్డి. డాక్టర్లు సుమిత్ర. యస్వంత్. సాయి తేజేశ్వని. శ్రవంతి. మురళీ మనోహర్. చంద్రకాంత్. శానిటేషన్ సూపరైజర్ లక్ష్మినారాయణ. శివ ప్రసాద్ రెడ్డి .. సచివాలయ హెల్త్ సెక్రటరీలు . ఆశా వర్కర్ల. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.