ఆళ్లగడ్డలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

ఆళ్లగడ్డలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
ఆళ్లగడ్డ ప్రతినిధి జనవరి 03 విభారె న్యూస్ :- ఆళ్లగడ్డ పట్టణంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపాల్ ఏ వెంకటరాముడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అపుస్మ నంద్యాల డివిజన్ అధ్యక్షులు టి అమిర్ భాష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హెచ్ఎం ఇమామ్ హుస్సేన్ మరియు ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థులతో కలిసి సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా ఉపాధి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొని సావిత్రిబాయికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లీలావతి, స్వర్ణలత, వెంకట లక్ష్మమ్మ, లక్ష్మీదేవి, మల్లేశ్వరమ్మ ,సుమ, గాయత్రి, లక్ష్మి, నాగేశ్వరమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.