రాయలసీమ గొంతు అణిచివేతకే బొజ్జా అరెస్ట్…

బొజ్జా అరెస్టుకు నిరసనగా నంద్యాల శ్రీనివాససెంటర్ లో రైతుల రాస్తారోకో—
విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి జనవరి 03 – రాయలసీమ ఉద్యమనేత బొజ్జా దశరథరామిరెడ్డిని వెంటనే విడుదల చేయాలని, రాయలసీమ గొంతు అణిచివేతకే బొజ్జాను అరెస్ట్ చేశారని, బొజ్జా అరెస్టుకు నిరసనగా నంద్యాల శ్రీనివాససెంటర్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. సాగు, తాగునీరిచ్చి రాయలసీమ కరువు దూరం చేయాలని అడిగితే ప్రభుత్వం అరెస్టు చేయడం అన్యాయమన్నారు. బొజ్జాను భేషరతుగా విడుదల చేయకుంటే ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు. రాయలసీమ కరువు,వలసల శాశ్వత పరిస్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయకుండా రాయలసీమ ప్రాంతానికి సాగు, త్రాగునీరు అందించి ఆదుకోవాలని పోరాడుతున్న రాయలసీమ ఉద్యమనేత బొజ్జా దశరథరామిరెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమని రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు. బొజ్జా దశరథరామిరెడ్డి అరెస్టుకు నిరసనగా బుధవారం నంద్యాల శ్రీనివాససెంటర్ లో రాయలసీమ సాగునీటి సాధన సమితి మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు మానవహారంగా నిలిచి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది శంకరయ్య, వైఎస్ఆర్ సిపి రైతు నాయకులు బెక్కెం రామసుబ్బారెడ్డి, ఇప్పల చిన్న తిరుపతి రెడ్డి, టిడిపి రైతు నాయకులు బాలీశ్వర్ రెడ్డి, రవిబాబు, గడివేముల మండల రైతు నాయకులు సంజీవరెడ్డి, పాణ్యం రైతు నాయకులు మురళీధర్ రెడ్డి, బండి ఆత్మకూరు మండల నాయకులు లాయర్ కృష్ణా రెడ్డి, మహానంది మండల నాయకులు, మున్సిపల్ కార్మికసంఘ నాయకులు షణ్ముఖరావు, జిల్లెల్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు