జిల్లాకు కొత్తగా 3,171. పెన్షన్లు— జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమూన్


విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి జనవరి 03 – పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ జిల్లాలో 2,24,228 పెన్షన్ దారులకు రూ.66.64 కోట్ల లబ్ది చేకూరుస్తున్నామని జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమూన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమూన్ మాట్లాడుతూ పేద ప్రజల ఆర్థికాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే వైయస్సార్ పెన్షన్ పథకం కింద జిల్లాలో 2,24,228 పెన్షన్ దారులకు రూ.66.64 కోట్ల లబ్ది చేకూరుస్తున్నామన్నారు. ఈ జనవరి మాసం నుండి కొత్తగా 3,171 మంది పెన్షన్ దారులకు రూ.95,13,000/-లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అవ్వ తాతలు, వితంతువులు, వికలాంగులకు ఇకపై ప్రతినెల రూ.2,750 నుంచి రూ.3వేల చొప్పున పెంచిన పెన్షన్ల లబ్ధిని అందజేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొత్తగా 554 మంది పెన్షన్ దారులు , బనగానపల్లిలో 566 మంది పెన్షన్ దారులు , డోన్ లో 462 మంది పెన్షన్ దారులు , నందికొట్కూర్ లో 487 మంది పెన్షన్ దారులు. నంద్యాలలో 567 మంది పెన్షన్ దారులు, పాణ్యంలో 141 మంది పెన్షన్ దారులు. శ్రీశైలంలో 394  మంది పెన్షన్ దారులు,  వెరసి మొత్తం 3,171 మంది నూతన పెన్షన్ దారులకు సంబంధించి రూ. 95.13 లక్షలు జనవరి మాసం నుండి అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు .
అనంతరం జిల్లా కలెక్టర్, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారుడు హబీబుల్లా , మార్క్ఫెడ్ చైర్మన్ పి పి నాగిరెడ్డి, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్, ఏపీఎస్పిడిసిఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి తదితరులు పెన్షన్ దారులకు మెగా చెక్ ను అందచేశా