ఘనంగా క్రాంతి జ్యోతి శ్రీమతి సావిత్రిబాయి పూలే 193వ జయంతి.ఎస్ఎఫ్ఐ..

విభారె న్యూస్ జనవరి 03 ఎమ్మిగనూరు.

క్రాంతి జ్యోతి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి బాలికల జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి నాగమణి మేడం డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ రావడం జరిగింది. వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశం లోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మహిళలు చదువుల కోసం సామాజిక రాజకీయ ఆర్థిక సాధికారత సాధిస్తారని వారి వారి హక్కులను స్వేచ్ఛా వాతావరణం లో ఉండడానికి కావాల్సిన పరిస్థితులు ప్రభుత్వాలు కల్పించాలని గొంతెత్తి పోరాడిన ధిరవనిత సావిత్రిబాయి పూలే అని అన్నారు.సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3 మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయాగాన్ అనే గ్రామంలో జన్మించింది అని ఆమె 9వ ఏటా 12 ఏళ్ల జ్యోతిరావు పూలేకు ఇచ్చి వివాహం చేయడం జరిగిందని అప్పటివరకు నిరక్షరాస్యరాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు కావడం జరిగిందని భర్త ప్రోత్సాహంతోనే అక్షర అభ్యాసనం చేసి విద్యావంతురాలు అయింది అని తెలియజేయడం జరిగింది. 1848లో భర్త జ్యోతిరావు పూలే తో కలిసి బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది.ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు.దీంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం,అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు.పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి.ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు.మోరో విఠల్, వాల్వేకర్,దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు.1851లో మరల పాఠశాల ప్రారంభించారు.బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసిందని తెలియజేయడం జరిగింది. అలాగే స్త్రీ పురుషులు కులమతాలకతీతంగా ఇదేనా అభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని అందుకే అందరూ చదవాలి అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలే. ఎప్పుడో 18 వ శతాబ్దంలో సావిత్రిబాయి పూలే చేసిన పోరాటాల ఫలితంగా ఈ రోజు రాజ్యాంగంలో మహిళలకు కనీసం హక్కులైన పొందుపరిచారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో