విభారె న్యూస్ జనవరి 02 ఎమ్మిగనూరు.
మార్గశిర మాసం మంగళవారం ను పురస్కరించుకొని పట్టణంలోని మెయిన్ బజార్ లో వెలసిన శ్రీ సుంకులమ్మ అవ్వ దేవాలయంలో శ్రీ సుంకులమ్మ అవ్వకు ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రాతః కాలంలోనే అమ్మవారికి అభిషేకం, అర్చన, పూల అలంకరణ, నిమ్మకాయల మాల వేసి ఆకు పూజను నిర్వహించారు. దేవాలయంను కూడా బంతిపూల మాలలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు విరివిగా పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం ను, ప్రసాదమును సమర్పించారు. అనంతరం అమ్మవారికి మహా మంగళహారతి నిర్వహించారు.తదుపరి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగినది. పై పూజా కార్యక్రమాలన్నీ ఆలయ పూజారులు నాగరాజు దంపతులచే నిర్వహించారు.