వేతనాలు పెంచాలని,ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రాట్యుటీ చెల్లించాలన్న వి ప్రధాన డిమాండ్లు
విభారే న్యూస్ డోన్ మా ప్రతినిధి :- జనవరి 2 సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె 22వ రోజు మంగళవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట దీక్షా శిబిరంలో అంగన్వాడీలు చెవిలో పూలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
సిఐటియు జిల్లా కార్యదర్శ టి.శివరాం,పట్టణ అధ్యక్షులు నక్కిశ్రీకాంత్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాళ్లు సులోచన,
రహమద్బి,సుమలత
మాట్లాడుతూ అంగన్వాడీలు
22 రోజులుగా రోడ్డున పడి సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా అంగన్వాడీలపై అబద్ధాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో ప్రజల చెవిలో పూలు పెడుతున్నదని అందుకే చెవిలో పూలు పెట్టుకొని ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నామన్నారు. ఇప్పటికే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదని అంగన్వాడీల సమస్యలు అన్నీ పరిష్కరించాము విధులలో చేరాలని ఒక అధికారి అంటున్నారని ఇది ప్రజలలో అంగన్వాడీలపై వ్యతిరేక భావనను ప్రచారం చేయడంలో భాగమని అన్నారు. ప్రధాన డిమాండ్లపై తేల్చకుండా చివరి ఒకటి, రెండు డిమాండ్లను పరిష్కరించినంత మాత్రాన సమ్మె ఎలా ఆగుతుందని మరోవైపు పలానా సమయంలో గా ఉద్యోగాలలో చేరకుంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని రాజకీయ నాయకుల లాగా ఉన్నతాధికారులు అంగన్వాడీలపై తప్పుడు ప్రచారాలు చేయడం, బెదిరింపులకు పాల్పడడం బాధాకరమని వారి లాగా అంగన్వాడీలకు లక్షల్లో వేతనాలు రావడం లేదని ఏది ఏమైనా వారి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ప్రధాన డిమాండ్లపై తేల్చకుండా సమ్మెను ఆపే ప్రసక్తే లేదని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ నాయకులు అక్బర్ బాషా,
సిఐటియు నాయకులు సి.రాము,అంగన్వాడి
యూనియన్ నాయకురాళ్లు యశోద,లక్ష్మీస్వరి,సుభద్ర,ఆదిలక్ష్మి,గుల్జార్,రాజేశ్వరి,శ్యామల,ప్రమీల,ధనలక్ష్మి,మాధవి,
అరుణ,లక్ష్మీదేవి,మాసుంబి
నాగలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.