కోసిగి ఫీల్డ్ అసిస్టెంట్ ను పరమార్శించిన మురళీ మోహన్ రెడ్డి

కోసిగి,జనవరి 02(విభారె న్యూస్) మండల కేంద్రమైన కోసిగి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లోకరెడ్డి గత 10 రోజుల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగిన అనంతరం,కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వై బాల నాగిరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం లోకరెడ్డిని మండల ఇంచార్జీ పి మురళీ మోహన్ రెడ్డి పరమార్శించారు అనంతరం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ,ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.ఈకార్యక్రమంలో యంపీపీ ఈరన్న,ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నరసింహులు, మహాంతేష్ స్వామి,యన్ నాగరాజు, బుళ్ళి నరసింహులు,మల్లికార్జున గౌడ్,దళవాయి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.