జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 శిబిరాన్ని ప్రారంభించిన మురళీ మోహన్ రెడ్డి
కోసిగి,జనవరి 02(విభారె న్యూస్) దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన జగనన్న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజల వద్దకే వైద్యం అందించే విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని కోసిగి మండల ఇంచార్జీ పి మురళీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి సచివాలయం 1 ఆది ఆంధ్ర స్కూల్ నందు యంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష 2వ దశ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఇంచార్జీ పి మురళీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,ఆరోగ్య సురక్ష ద్వారా పరీక్షించిన వైద్యులు, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందివ్వడంతో పాటు ప్రయాణ ఖర్చులు నిమిత్తం 500 రూపాయాలు ఇవ్వడం జరిగిందని,ఓ పి హెచ్ సి వైద్యుడు,2 స్పెషలిస్ట్ డాక్టర్లు, అప్తాల్మిక్ అసిస్టెంట్,ఏ యన్ యం,యం యల్ హెచ్ పీ, ఆశావర్కర్లు,సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో ప్రతి మంగళవారం ఒక్కొక్క సచివాలయం నందు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్లు నజీర్ అహ్మద్,రజిత,యంపీపీ ఈరన్న, ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు నరసింహులు, మహాంతేష్ స్వామి,యన్ నాగరాజు, మాణిక్యరాజు,హోళగుంద కోసిగయ్య,బుళ్ళి నరసింహులు, ఉస్మాన్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.