ఘనంగా మనసున్న మహారాజు వహాబ్ జన్మదిన వేడుకలు.

-పేద, అనాధ విద్యార్థులకు వృద్దులకు అన్నదానం.
-ప్రిన్స్ వహాబ్ ను ఘనంగా సత్కరించిన పూలే అంబేడ్కర్ సొసైటీ సభ్యులు.

విభారె న్యూస్ జనవరి 02 ఎమ్మిగనూరు.

పట్టణానికి చెందిన ప్రిన్స్ స్వచ్చంద సేవా సమితి అధ్యక్షుడు హీరో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అద్యక్షుడు ప్రిన్స్ వహాబ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం పట్టణంలోని హెచ్.బి.ఎస్ కాలనీ లో గల పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు నరసన్న అధ్యక్షతన వారి సభ్యులతో కలిసి ప్రిన్స్ వహాబ్ ను శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం పేద అనాధ పిల్లల బాల బాలికల సంరక్షణ కేంద్రంలోని పిల్లలకు పౌష్టిక ఆహారంతో పాటు పిల్లలకు, వృద్దులకు పండ్లు,స్వీట్లు అందజేశారు.ఈ సందర్భంగా అద్యక్షుడు నరసన్న మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి సామజిక సేవలో నిమగ్నమై ప్రిన్స్ వహాబ్ ఎమ్మిగనూరు పట్టణ ప్రజల మన్ననలు పొందారని పేదలకు, అన్నార్థులకు అనాధ పిల్లలకు ఎనలేని సేవలు చేశారని నాటి కళాశాల స్థాయి నుంచి ఆయన సేవలు చూస్తున్నామని కొనియాడారు.ఆయనకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరారు.వీరితో పాటు మిత్రులు,ప్రజాప్రతినిధులు అలాగే ప్రిన్స్ సేవాసమితి సభ్యులు ఆనంద్, వెంకటేష్,వాసు, రంగస్వామి గౌడ్, స్వరూప్, ఓంకార్, జమీర్, ఖాజా, ప్రభాకర్,ఈశ్వర్,తారక్, నరసింహులు లు ఘనంగా సత్కరించారు.వహాబ్ మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తనపై ఈ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు ప్రతిభ భారతి కమిటీ సభ్యులు
కె.నాగరాజు, సింగనేటి నరసన్న, వడ్డే తిరుపతన్న, మహానంది, పురుషోత్తం, అర్లప్ప,మాజి సర్పంచ్ దాసన్న తదితరులు పాల్గొన్నారు.