కార్మికుల సమ్మె తో నంద్యాల పట్టణంలో దుర్వాసన :: చెత్తాచెదారం వెంటనే తొలగించాలని స్థానికుల డిమాండ్

విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి జనవరి 02 – నంద్యాల పట్టణం లో మున్సిపల్ కార్మికుల సమ్మె తో ఎక్కడ చూసినా చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది అపరిశుభ్రంగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
నంద్యాల టౌన్ లోని స్థానిక ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండడం వలన చెత్తాచెదారం తీసుకుక పోవడం వల్ల అపరిశుభ్రంగా మారి దుర్వాసన కొడుతుంది ఎప్పుడు రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో ఇలా చెత్త చెదారం పేరుకుపోవడంతో రాకపోకలు జరుపుతున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.