రాష్ట్రస్థాయి పోటీలకు అనంత విద్యార్థుల ఎంపిక

పోటీలకు ఎంపికైన విద్యార్థులతో అనంత విద్యాసంస్థల అధినేత రామ సుబ్బారెడ్డి

ఆళ్లగడ్డ ప్రతినిధి డిసెంబర్ 30 విభారె న్యూస్ :– ఆళ్లగడ్డ పట్టణంలోని వైపిపియం కళాశాల మైదానంలో ఈనెల 24 తేదీన నిర్వహించిన జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ పోటీలలో ఆళ్లగడ్డ అనంత జూనియర్ & డీగ్రీ కళాశాల విద్యార్థులు ఉమ్మడి కర్నూలు మరియు నంద్యాల జిల్లా జట్టు టీంకు ఎంపిక కావడం జరిగిందని అనంత విద్యాసంస్థల అదినేత అనంత రామసుబ్బారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరణ్, ఇంద్ర, రాముడు, లక్ష్మణ్, చిన్న, నరసింహ, లక్ష్మీ నరసింహ, ఉగ్ర దేవా, మహేష్, బాలాజీ, ప్రసాద్, మనోజ్ కుమార్, భరత్, మహేంద్ర జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు మా కళాశాల విద్యార్థులు ఎంపిక కావడం ఆనందించదగ్గ విషయం అన్నారు. జనవరి నెల 11, 12, 13 వ తేదీలలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. క్రీడలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడుతాయని విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా విజయం సాధించి తిరిగి రావాలని ఆకాంక్షిoచారు. వీరి విజయానికి కృషిచేసిన మా కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటరమణ ను, విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు.