విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి డిసెంబర్ 30-ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తాసిల్దారులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి సేవలు మరింత విస్తృత పరిచేందుకు ల్యాప్టాప్ లు పంపిణీ చేసామని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ తెలిపారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారుల సమీక్ష అనంతరం తాసిల్దారుల సేవలను గుర్తించి నూతన సంవత్సర కానుకగా అన్ని మండలాల తాసిల్దార్లకు జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్యలు ల్యాప్టాప్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ నంద్యాల నూతన జిల్లాగా ఏర్పాటైనప్పటి నుండి వసతులు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ తాసిల్దార్లు ప్రజలకు సర్వీసులు అందించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను నిర్ణీతకాల పరిమితిలోగా పూర్తి చేయడంతో పాటు ప్రముఖుల పర్యటనలకు అత్యవసర సేవలు అందించడంలో కూడా రెవెన్యూ అధికారుల పాత్ర కీలకమైందన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తాసిల్దార్ లు మరిన్ని సేవలు ప్రజలు మెచ్చే రీతిలో అందించేందుకు ప్రతి మండల తాసిల్దార్ కు ల్యాప్టాప్ లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, దాసు అన్ని మండలాల తహశీల్దార్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రంలోనే నంద్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.