శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు….ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి

విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి డిసెంబర్ 30-డిసెంబర్ 31 తేదీ రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలి.న్యూ ఇయర్ ఈవెంట్స జరుపుకునేవారు రెండు రోజుల ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి.మరియు సీసి కెమరాల పర్యవేక్షణ తప్పనిసరి.మోటార్ బైక్ ల సైలెన్సర్ తీసివేసి ఆదిక శబ్ధం వచ్చేలా రోడ్లపై ప్రయాణించరాదు. మద్యం సేవించి రోడ్లపై ప్రయాణించరాదు.వాహనాలపై ఆదిక వేగంతో మరియు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేయరాదు.అవుట్- డోర్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో డీజే సౌండ్ బాక్సులు, బాణాసంచాను కాల్చడానికీ అనుమతి ఇవ్వట్లేదని స్పష్టం చేశారు.మహిళలపై ఎలాంటి వేధింపులకు పాల్పడకుండా నిరోధించడానికి దిశ పోలీసులు మరియు జిల్లా పోలీసు యంత్రాంగం అందుబాటులో ఉంటాయని తెలిపారు.వైన్ షాపులు నిర్దేశిత సమయంలోగా మూసివేయాల్సి ఉంటుందని, మైనర్లకు మద్యం విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామని, మద్యం మత్తులో వాహనాలను నడిపే వారు, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని , బైక్ రేసర్లపై నిఘా ఉంచుతామని అన్నారు.శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అన్ని చర్యలను తీసుకుంటున్నామని, పోలీసులకు సహకరించాలని సూచించారు. పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని వివరించారు. ప్రత్యేక పోలీసు బృందాలను నియమిస్తామని అన్నారు.
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పాటించాల్సిన నిబంధనలను ఆయన ప్రజలకు వివరించారు. 31వ తేదీన రాత్రి 01 గంటల తరువాత ప్రజల గుంపులు గుంపులు తిరగడం కానీ, ఒకే ప్రదేశంలో ఉండడం కాని చేయకూడదన్నారు. రాత్రి వాహనాల తనిఖీలు ఉంటుందని, మద్యం సేవించడం గాని ముగ్గురు వ్యక్తులు ప్రయాణించడం గానీ, నేషనల్ హైవే పై బైకు రేస్ చేయడం చేస్తే అలాంటి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎటువంటి కేక్ కటింగ్ కార్యక్రమాలు వీధులలో లేదా రోడ్ల పై చేయకూడదన్నారు.
కేక్ కటింగ్ చేయాలనుకునే వారు తమ తమ ఇళ్లలోనే వారి కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలలో నడుపుటకు అనుమతి లేదన్నారు. ఏదేని కార్యక్రమాలు చేయుటకు ముందస్తుగా పోలీసుల పర్మిషన్ పొందాలన్నారు. లేనిచో చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ లచే రాత్రిళ్ళు గస్తీ నిర్వహిస్తామని, సోషల్ మీడియా లో అభ్యంతకరమైన, అసభ్యకరమైన అంశాలు పోస్ట్ చేయరాదన్నారు.
31వ తేదీ రాత్రి యువత తాగిన మైకంలో అత్యుత్సాహం ప్రదర్శించకుండా వేడుకను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ లు తీసి అధిక శబ్దాలతో రోడ్లపై నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలో వివిధ కాలనీలలోని వీధి దీపాలను ధ్వంసం చేయడం గాని ప్రభుత్వ సంస్థల ఆస్తులకు నష్టం కలిగించడం గాని చేస్తే కఠిన చర్య తప్పవన్నారు. ఈ సంవత్సరం వేడుకల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.