అళ్ళగడ్డ ప్రతినిధి సెప్టెంబర్ 16 విభారె న్యూస్:- పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈనెల 17వ తేదీ మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్టు ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. అనేక రకాల రసాయనాలు కలిపి తయారుచేసిన విగ్రహాల వలన పర్యావరణం దెబ్బతింటుందని, రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థి దశ నుండే పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రసాయనాలు వాడిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం వలన వాతావరణ కాలుష్యం మరియు జల కాలుష్యం ఏర్పడుతోందని దీని వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆయన తెలిపారు.పూర్వం అందరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించే వారు. కనుక సహజ సిద్ధంగా ప్రకృతి మనకు ఇచ్చిన మట్టితో చేసిన విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకునేవారు. మట్టి విగ్రహాలు కావలసినవారు 17వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి వద్దకు రావలెనని ఆయన కోరారు.