ఆళ్లగడ్డ::(విభారె న్యూస్): అక్టోబర్ 11: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, రుద్రవరం మండలం, ముకుందాపురం గ్రామంలోని శ్రీ రామాలయం నందు మంగళవారం నుండి నాలుగు రోజుల పాటు ప్రతిరోజు ఇస్కాన్ ధర్మ ప్రచారకులు శ్రీ నిత్యతృప్తదాస్ చే శ్రీమద్రామాయణం, మహాభారతం భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, ప్రతిరోజు భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను స్థానిక భక్త సమాజంతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుండా వరలక్ష్మి, తితిదే ధర్మప్రచార మండలి సభ్యులు టి.వి.వీరాంజనేయరావు, కొత్త పల్లె లక్ష్మీ నరసయ్య, నరసింహుడు, ఎన్. రంగనాయకులు, పి వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, కృష్ణ, వెంకటసుబ్బయ్య, పి. రామస్వామి, పి. వెంకటేశ్వర్లు, చిన్న నరసయ్య, సుబ్బమ్మ, శేఖర్, రమణయ్య, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.