మాజీ సైనికుల సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరం :: న్యాయవాది విజయభాస్కర్ రెడ్డి

ఆళ్లగడ్డ :: విభారె న్యూస్:: 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆళ్లగడ్డ పట్టణంలోని బాలాజీ వీధిలో మాజీ సైనికో ఉద్యోగుల కార్యాలయం నందు ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవానికి న్యాయవాది విజయభాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాజీ సైనికులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ మాజీ సైనికోద్యోగులు దేశభక్తికి మారుపేరు అని పేర్కొన్నారు. ఈరోజు భారతీయులు నిర్భయంగా జీవించగలుగుతున్నారంటే అనేకమంది వీర జవాన్ల ప్రాణత్యాగ ఫలితమే అని ఆయన గుర్తు చేశారు. మాజీ జవాన్లు తమ అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని, వారి సేవలు ఈ సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు.మాజీ సైనికులు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టినను వారికి తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు