ఆళ్లగడ్డ ప్రతినిధి జులై 31 విభారె న్యూస్ :- బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది రాయసం ఆదిశేషు విటల్ బాబు కిడ్నాప్, అనంతరం హత్య దారుణమని అడ్వకేట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు రమణయ్య, ఉపాధ్యక్షులు మురళీధర్ గౌడ్ లు అన్నారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో తరచూ న్యాయవాదుల మీద దాడులు హత్యలు తప్పుడు కేసులు నమోదు చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. విటల్ బాబు మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. వారితోపాటు సెక్రటరీ శివప్రసాదరావు,కోశాధికారి తిరుపాల్ రెడ్డి న్యాయవాదులు ఖాజా హుస్సేన్, వెంకటసుబ్బయ్య, లత, జాకీర్ గోల్డ్, అజయ్ తదితరులు ఉన్నారు.