ఫ్రెండ్లీ ఎస్ఐ శ్రీనివాసులు కు సిపిఐ నాయకులు సన్మానము

పెద్దకడబూరు జూలై 19:: (విభారె న్యూస్) పెద్దకడుబూరు మండల కేంద్రమైన పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాసులు ఇస్వి పోలీసు స్టేషన్ కు బదిలీ అయ్యారు. బుధవారం బదిలీపై వెళుతున్న ఎస్ఐ శ్రీనివాసులును సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ ఆధ్వర్యంలో శాలువతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ శాంతి భద్రతలే పరిరక్షణే ద్యేయంగా మూడు సంవత్సరాలు మండలంలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారన్నారు. కరోనా సమయంలోను మండల ప్రజల శాంతి భద్రతలే ద్యేయంగా పనిచేశారని కొనియాడారు . మట్కా, గుట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించేందుకు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. మండలంలో ఏ చిన్న గొడవలు జరిగినా వెంటనే స్పందించి న్యాయం చేసే వారని సిపిఐ పార్టీ కార్యక్రమాలకు మంచి ప్రోత్సాహం చేసేవారని వారన్నారు అనంతరం సిపిఐ మండల సమితి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో తెలిపారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు చూరగొని, సమర్థవంతమైన ఎస్ఐ గా పేరు సంపాదించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తిక్కన డోల్ అనుమంతు గోపాల్ నర్సింహులు ముద్రగప్ప ఆంజనేయ మేకడనా రెక్కల గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు