ఆళ్లగడ్డ ప్రతినిధి జులై 11 విభారె న్యూస్:- పశువులలో కృత్రిమ గర్భధారణ సమయంలో వీర్యకణాలు చనిపోకుండా చక్కటి కదలికలతో కట్టు శాతం పెంచుటకు థాయింగ్ మానిటర్స్ ను ఉపయోగించుకోవడం వల్ల సాధ్యమవుతుందని పశు సంవర్ధక శాఖ ఏడిఏ వరప్రసాద్ సూచించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘనీకృత వీర్యాన్ని ధ్రవ రూపంలోకి మార్చుటకు ఘనీకృత స్థితిలోని వీర్యకణాలను వేడినీటిలో ఉంచి తీయడం ద్వారా ద్రవరూపంలోకి మారుతుందన్నారు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని రైతులకు తోడ్పడాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమానికి తన వంతు సహాయం అందించిన న్యాయవాది ఆవుల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పశు సంపద పెరిగి నాణ్యమైన పాల ఉత్పత్తిని ఈ థాయింగ్ మానిటర్స్ ను ఉపయోగించుకోవాలన్నారు. దాయింగ్ మనిటర్స్ అందించిన ఆవుల విజయభాస్కర్ రెడ్డి (లాయర్)ని, ఏడిఏ.వరప్రసాద్,సహాయ సంచాలకులు,డాక్టర్ A. కొండారెడ్డి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్.A.కొండారెడ్డి , డబ్ల్యు. కొత్తపల్లి పశువైద్యాధికారి కె.ఆర్.వి పుల్లయ్య,గోపాలమిత్ర బృందం, పాల్గొన్నారు.