ఆళ్లగడ్డలో టైలర్ల సమ్మె

ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్) టైలర్ షాప్ ల నిర్వాహకుల వైఖరికి నిరసనగా గత వారం రోజులుగా ఆళ్లగడ్డ పట్టణంలోని కమిషన్ ప్రాతిపదికన పనిచేసే టైలర్లు సమ్మె చేస్తున్నారు. తమ కమీషన్లు సవరించాలని టైలర్ లు నిర్వాహకులను కోరారు. నిర్వాహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో టైలర్ లు గత వారం రోజుల నుంచి తమ విధులకు హాజరు కాకుండా సమ్మె నిర్వహిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నందున ఇప్పటికైనా యాజమాన్యం వారు తమ బాధలను అర్థం చేసుకొని కమిషన్ పెంచాలని వారు కోరారు. లేకుంటే నిరవధిక సమ్మె చేస్తామని వారు తెలిపారు. టైలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జంబులదిన్నె మాబు సాహెబ్ మధ్యవర్తిత్వం లో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కొంతమేరకు కమిషన్ పెంచేందుకు యజమాన్యాలు అంగీకరించాయి. రెడీమేడ్ దుస్తుల ప్రభావంతో టైలర్లు తమ జీవన భృతిని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని, టైలర్ షాప్ లో నిర్వహణ భారంగా మారిందని బాబు టైలర్స్ యజమాని పెద్ద ఫకృల్లా తెలిపారు సంతృప్తి చెందని టైలర్లు సమ్మె వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.