ఆళ్లగడ్డ లో ఘనంగా వివేకానంద జయంతి ఉత్సవాలు

ఆళ్లగడ్డ:: (విభారె న్యూస్ ):: ఆళ్లగడ్డ పట్టణంలో స్వామి వివేకానంద 159 వ జన్మదిన సందర్భంగా స్వామి వివేకానంద విశ్వమానవ సేవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అవుల పుల్లారెడ్డి సేవా సమితి కార్యాలయం నుండి ఊరేగింపుగా నాలుగు రోడ్ల కూడలి మీదుగా ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు సాగిన ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వివేకానందుని వేషధారణలో చిన్నారులు సందడి చేస్తూ చూపరులను ఆకర్షించారు.సుధాకర్ రావు మరియు రామకృష్ణ గార్లు యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆతిధులుగా ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి అధ్యక్షులు, “విభారె” దినపత్రిక సంపాదకులు ఆవుల విజయ భాస్కర్ రెడ్డి,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్,సబ్ జైల్ సబ్ ఇన్స్పెక్టర్ అజ్గర్ హుస్సేన్,డాక్టర్. ఉమాదేవి, వివేకానంద విశ్వమానవ సేవా సమితి అధ్యక్షులు శివప్రసాద్ మరియు సేవా సమితి సభ్యులు యువకులు పాల్గొన్నారు.